అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా? | Has Kohli opened up about his relation with Anushka via his t-shirt? | Sakshi
Sakshi News home page

అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా?

Apr 12 2016 3:11 PM | Updated on Sep 3 2017 9:47 PM

అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా?

అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు. టి-20 ప్రపంచ కప్లో విరాట్ బ్యాటింగ్ మెరుపులను నెటిజన్లు తెగ ప్రశంసించారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్గా మారింది.

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో రెండున్నరేళ్ల బంధాన్ని టి-20 ప్రపంచ కప్నకు ముందు విరాట్ తెగదెంపులు చేసుకున్నాడు. కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందని వదంతులు షికారు చేశాయి. విరాట్ ఆడుతుంటే స్టేడియంలోని గ్యాలరీలో సందడి చేసే అనుష్క టి-20 ప్రపంచ కప్ సందర్భంగా ఎక్కడా కనిపించలేదు. అయితే గతవారం ఇద్దరూ కలసి మళ్లీ  కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  గత బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్‌లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు. దీంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించిందంటూ బాలీవుడ్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ కొత్త ఫొటో బాగా పాపులరయింది. ఆ ఫొటోలో విరాట్ టీ షర్ట్ వేసుకున్నాడు. దానిపై 'వు వర్ ఆన్ ఏ బ్రేక్' అని రాసి ఉంది. అనుష్కతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు ఇలా టీ షర్ట్ ద్వారా వెల్లడించాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంతకీ అనుష్కతో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నాడా? లేక మళ్లీ కలసిపోయారా అన్నది కోహ్లీకే తెలియాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement