సచిన్‌ జెర్సీ వివాదం.. బీసీసీఐ క్లారిటీ.. | Has the BCCI 'unofficially' retired Sachin Tendulkar's No. 10 jersey | Sakshi
Sakshi News home page

సచిన్‌ జెర్సీ వివాదం.. బీసీసీఐ క్లారిటీ..

Nov 29 2017 11:30 AM | Updated on Nov 29 2017 11:33 AM

Has the BCCI 'unofficially' retired Sachin Tendulkar's No. 10 jersey - Sakshi

న్యూఢిల్లీ: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జెర్సీ నంబర్‌ 10 పై నెలకొన్న వివాదంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. అనధికారికంగా ఈ జెర్సీ నంబర్‌ను రిటైర్మెంట్‌  ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఏ క్రికెటర్‌ అంతర్జాతీయ మ్యాచుల్లో 10వ నంబర్‌ జెర్సీ ధరించవద్దని నిర్ణయించింది.

‘అనవసర వివాదాలకు దారితీస్తు ఆటగాళ్లపై విమర్శలు రావడానికి కారణమవుతున్న జెర్సీ నెం10కి అనధికారికంగా వీడ్కోలు పలుకుదాం. అయితే ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కాకుండా దేశవాళి, భారత్‌- ఏ మ్యాచుల్లో ఈ జెర్సీ ధరించవచ్చు. అని’ బీసీసీఐ అధికారులు ఓ జాతీయ చానెల్‌కు తెలిపినట్లు తెలుస్తోంది.

ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా ఆయన క్రికెట్‌కు అందించిన సేవలకుగాను గౌరవపూర్వకంగా తాము 10వ నంబర్‌కు కూడా రిటైర్మెంట్‌ ఇస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్‌ కూడా 10వ నంబర్‌ జెర్సీ ధరించడని అప్పట్లో బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. అయితే గత ఆగష్టులో శ్రీలంక పర్యటనలో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన యువ క్రికెటర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ 10వ నంబర్‌ జెర్సీ ధరించడం సచిన్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు బీసీసీఐ, ఠాకుర్‌పై విమర్శలు గుప్పించారు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కూడా సచిన్‌కు గౌరవ సూచకంగా 10వ నెంబర్‌ జెర్సీకి వీడ్కోలు పలికింది. ఐపీఎల్‌ నుంచి సచిన్‌ రిటైర్మెంట్‌ అనంతరం  ఏ ముంబై ఆటగాడు నెం.10వ జెర్సీని ధరించడం లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement