హరికృష్ణ గేమ్ ‘డ్రా’ | Harikrishna game 'draw' | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గేమ్ ‘డ్రా’

Sep 15 2015 12:00 AM | Updated on Aug 29 2018 1:13 PM

హరికృష్ణ గేమ్ ‘డ్రా’ - Sakshi

హరికృష్ణ గేమ్ ‘డ్రా’

ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’గా

బాకు (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ సేతురామన్‌తో సోమవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 74 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.

మంగళవారం వీరిద్దరి మధ్యే జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ‘డ్రా’ అయితే, బుధవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఆరుగురు బరిలోకి దిగగా... సూర్యశేఖర గంగూలీ, లలిత్‌బాబు, ఆధిబన్, విదిత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement