తెలంగాణ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ జట్టుకు సన్మానం

Great Honour For Badminton Team Of Telangana - Sakshi

హైదరాబాద్‌: జాతీయ మాస్టర్స్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో రాణించిన తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్‌లో నిర్వహించిన ఈ అభినందన కార్యక్రమంలో తెలంగాణ మాస్టర్స్‌ గేమ్స్‌ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రావు, అఖిల భారత మాస్టర్స్‌ గేమ్స్‌ కన్వీనర్‌ సంజయ్‌ల క్రీడాకారులను సన్మానించారు.

ఈ సందర్భంగా జట్టు సభ్యులు వేణు ముప్పాల, జ్ఞాన ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ పోటీల్లో కాంస్యం నెగ్గడం ఆనందంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే పోటీల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని చెప్పారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top