వరుస గేముల్లో లలిత్‌బాబు గెలుపు | grand masters winner M.R lalit babu | Sakshi
Sakshi News home page

వరుస గేముల్లో లలిత్‌బాబు గెలుపు

Jan 11 2014 12:44 AM | Updated on Sep 2 2017 2:29 AM

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు.

 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు.  లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో శుక్రవారం నాటి రెండో రౌండ్లో లలిత్‌బాబు ... అంతర్జాతీయ మాస్టర్ ఎస్.నితిన్ (1)పై విజయం సాధించాడు.
 
 అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో అతను... భారత ఆటగాడు అనూప్ దేశ్‌ముఖ్‌ను ఓడించాడు. తాజా విజయాలతో అతను 2 పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలిరౌండ్‌లో గెలిచిన హర్ష భరతకోఠి (1.5).... ఫ్రాంకోయిస్ ఫార్గెర్‌తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. శనివారం జరిగే మూడో రౌండ్ పోరులో లలిత్‌బాబు... రాజేశ్‌తో తలపడతాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement