భారత్ గోల్స్ వర్షం | Goals rain in India | Sakshi
Sakshi News home page

భారత్ గోల్స్ వర్షం

Sep 7 2015 12:30 AM | Updated on Sep 3 2017 8:52 AM

మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు సూపర్ షోతో అదరగొడుతోంది

చాంగ్జౌ (చైనా) : మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు సూపర్ షోతో అదరగొడుతోంది. ఆదివారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో సింగపూర్‌ను 12-0 తేడాతో చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో ఉత్తర కొరియాను 13-0తో ఓడించిన భారత అమ్మాయిలు ఈ మ్యాచ్‌లోనూ అదే రీతిన చెలరేగారు. తొలి నిమిషం నుంచే ఎదురుదాడికి దిగి ఫలితాన్ని రాబట్టారు. ఆరో నిమిషంలో పూనమ్ బార్లా తొలి గోల్ సాధించింది. 10వ నిమిషంలో అనూపా బార్లా, ప్రీతీ దూబే (15), జస్‌ప్రీత్ (25) గోల్స్‌తో తొలి అర్ధభాగంలో జట్టు 4-0తో ఆధిక్యం సాధించింది.

ద్వితీయార్ధంలో లిలీ మయేబ్గమ్ (49) గోల్‌తో పాటు 52, 59, 61, 64, 65, 68, 70 నిమిషాల్లో వచ్చిన గోల్స్‌తో భారత్ విజయకేతనం ఎగురవేసింది. 9న చైనాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement