మరోసారి చెలరేగిన శుభ్మాన్ | gill, shaw drives centuries india to 382 | Sakshi
Sakshi News home page

మరోసారి చెలరేగిన శుభ్మాన్

Feb 6 2017 1:09 PM | Updated on Sep 5 2017 3:03 AM

మరోసారి చెలరేగిన శుభ్మాన్

మరోసారి చెలరేగిన శుభ్మాన్

అండర్ -19 వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డేలోనూ భారత ఓపెనర్ శుభ్మాన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు.

ముంబై: అండర్ -19 వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డేలోనూ  భారత ఓపెనర్ శుభ్మాన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. గత వన్డేల్లో శతకంతో మెరిసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్మాన్... నాల్గో వన్డేలో భారీ శతకం సాధించాడు. 120 బంతుల్లో 23 ఫోర్లు, 1 ఫోర్ సాయంతో 160 పరుగులు చేశాడు. అతనికి జతగా పృథ్వీ షా (105;89 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్సర్లు)  సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడి రెండో వికెట్ కు 231 పరుగుల భాగస్వామ్యాన్ని  జత చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.

ఇప్పటికే ఈ ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-1 తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి వన్డేల్లో ఇంగ్లండ్ గెలవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తో గెలిస్తే సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ ఫలితం కోసం చివరి వన్డే వరకూ వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement