‘నా కళ్లలోకి చూడాలంటే గంభీర్‌ భయపడేవాడు’

Gambhir Avoided Eye To Eye Contact With Me Irfan - Sakshi

కరాచీ:  దాదాపు ఏడేళ్ల నాటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నాడు పాకిస్తాన్‌ వెటరన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌. 2017లో పీసీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కింద నిషేధం ఎదుర్కొన్న ఇర్ఫాన్‌.. ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. ఏడు అడుగులు పైగా ఉండే ఇర్ఫాన్‌.. 2012లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో గౌతం గంభీర్‌ను ఎక్కువ సార్లు ఔట్‌ చేశాడు. ఆ సిరీస్‌లో భాగంగా వన్డేలు, టీ20ల్లో కలిపి గంభీర్‌ను నాలుగుసార్లు ఔట్‌ చేశాడు ఇర్ఫాన్‌. దీనిలో భాగంగా ఆనాటి విషయాల్ని మరోసారి షేర్‌ చేసుకున్నాడు.

‘నేను భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు  ఆడినప్పుడు వారు నన్ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. నా ఎత్తు కారణంగా నేను వేసే బంతుల్ని సరిగా అంచనా వేయలేకపోయేవారు. అందులో గంభీర్‌ ఒకడు. గంభీర్‌ నా కళ్లలోకి చూడటాన్ని తప్పించుకునేవాడు. నా కళ్లలోకి నేరుగా చూడటానికి భయపడేవాడు.  నా కారణంగానే అతని కెరీర్‌ ముగిసిందని అనుకుంటున్నా. మాతో భారత్‌లో జరిగిన ఆ సిరీస్‌ తర్వాత అతను జట్టులో అవకాశాలు పెద్దగా రాలేదు. ఆపై గంభీర్‌ ఒకే సిరీస్‌ ఆడినట్లు నాకు గుర్తు. ప్రధానంగా నా ముఖంలో చూడటానికి గంభీర్‌ ఆసక్తి చూపేవాడు కాదు. రెండు జట్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో ఉన్నప్పుడు కూడా నా కళ్లలోకి చూసేవాడు కాదు’ అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top