వింబుల్డన్ కు ఫెడరర్ సిద్ధం | Fresh Federer ready for Wimbledon history bid | Sakshi
Sakshi News home page

వింబుల్డన్ కు ఫెడరర్ సిద్ధం

Jun 30 2017 3:29 PM | Updated on Sep 5 2017 2:52 PM

వింబుల్డన్ కు ఫెడరర్ సిద్ధం

వింబుల్డన్ కు ఫెడరర్ సిద్ధం

స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సిద్ధమయ్యాడు.

లండన్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సిద్ధమయ్యాడు. జూలై 3 వ తేదీ నుంచి ఆరంభమయ్యే వింబుల్డన్ టోర్నీకి ఫెడరర్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ గెలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్.. ఆపై ఫ్రెంచ్ ఓపెన్కు మాత్రం దూరంగా ఉన్నాడు.

 

గ్రాస్ కోర్టు, హార్డ్ కోర్టులపై మరింత దృష్టిపెట్టాలనే ఉద్దేశంతోనే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఫెడరర్ తప్పుకున్నాడు. దీనిలో భాగంగా మరో వింబుల్డన్ టైటిల్ పై గురి పెట్టాడు. పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ఫెడరర్‌.. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదో  వింబుల్డన్ టైటిల్ పై దృష్టి పెట్టిన ఫెడరర్.. ఈ టోర్నీకి సిద్ధం కావడాన్ని సమర్ధించుకున్నాడు. గ్రాస్ కోర్టులో మెరుగైన రికార్డు ఉండటంతో ఫ్రెష్ గా వింబుల్డన్ లో పాల్గొనబోతున్నట్లు తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement