నాలుగు స్వర్ణాలతో మెరిసిన జూనియర్లు | four gold medals wins juniors | Sakshi
Sakshi News home page

నాలుగు స్వర్ణాలతో మెరిసిన జూనియర్లు

Jun 5 2016 12:41 AM | Updated on Sep 4 2017 1:40 AM

ఆసియన్ జూనియర్ అథ్లెటి క్స్ చాంపియన్‌షిప్ రెండో రోజు భారత జూనియర్లు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

న్యూఢిల్లీ: ఆసియన్ జూనియర్ అథ్లెటి క్స్ చాంపియన్‌షిప్ రెండో రోజు భారత జూనియర్లు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో శనివారం జరిగిన ఈవెంట్‌లో నాలుగు పసిడి, ఒక కాంస్యం సహా ఐదు పతకాలు సాధించారు. హ్యామర్ త్రోలో ఆశిష్ జాఖర్ స్వర్ణం దక్కించుకున్నాడు.

హుస్సేన్ థామర్ (ఇరాక్), జలోఖాన్ (ఉజ్బెకిస్తాన్) రజత, కాంస్య పతకాలు సాధించారు. 1500 మీ. బాలికల పరుగులో లిల్లీ దాస్ (4: 20. 50 సె.) స్వర్ణం సాధించగా... మరో అమ్మాయి హమిలన్ కౌర్ (4: 33. 02 సె.) కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. బాలుర విభాగంలో అజయ్ సరోజ్ (3: 57. 55 సె.), 400మీ పరుగులో జిస్నా మాథ్యు (53. 85 సె.) స్వర్ణాలు నెగ్గారు. ఈ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత్ రెండు కాంస్య పతకాలను సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement