రోడ్డు ప్రమాదంలో మాజీ ఎఫ్ 1 డ్రైవర్ మృతి! | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎఫ్ 1 డ్రైవర్ మృతి!

Published Mon, Oct 6 2014 2:50 PM

Former F1 driver Andrea De Cesaris killed in motorbike accident

రోమ్: సప్త సముద్రాలు ఈదిన ఒకాయన.. పిల్ల కాలువలో పడి చనిపోయాడట!. అలాంటి సామెతనే గుర్తు చేసేలా ఓ ప్రమాదంలో ఫార్ములా వన్ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.మాజీ ఎఫ్ వన్ డ్రైవర్ అండ్రియా డే సెసారిస్ ఇటీవల జరిగిన మోటర్ సైకిల్ ప్రమాదంలో మృతి చెందారు. 
 
1980 నుంచి 1990 మధ్య కాలంలో ఫార్ములా వన్ రేసులో డి సెసారిస్ పాల్గొన్నారు. కాంక్రీట్ గోడకు తన వాహనం గుద్దుకోవడంతో డి సెసారిస్ మరణించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.  ఇటీవల జపాన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఫ్రెంచ్ డ్రైవర్ జులెస్ బియాంచి మృత్యువుతో పోరాడుతున్న సంఘటన తెలిసిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement