‘నేనే చివరి ఫిక్సర్‌ను కాదు కదా’

Fixing Players Should Have Got A Second Chance, Mohammad Asif - Sakshi

ఫిక్సర్లకు మరో అవకాశం ఇవ్వండి

మ్యాచ్‌ ఫిక్సర్లు  బోర్డులోనే ఉన్నారు

మహ్మద్‌ అసిఫ్‌ కామెంట్స్‌

కరాచీ: ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారని అందులో తాను ఒకడినని అంటున్నాడు పాకిస్తాన​ వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ అసిఫ్‌. 2010లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఆపై  ఏడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న అసిఫ్‌.. మళ్లీ పాకిస్తాన్‌ జట్టులో కనిపించలేదు. అప‍్పట్లో అసిఫ్‌పై ఉన్న నిషేధాన్ని ఐదేళ్లకు తగ్గించినా ఆ తర్వాత అతనికి పాక్‌ జట్టులో పునరాగమనం చేసే అవకాశం రాలేదు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం  ఇచ్చినా తనకు మాత్రం రెండో చాన్స్‌ ఇవ్వలేదని అంటున్నాడు అసిఫ్‌. తన సహచర బౌలర్‌, మహ్మద్‌ అమిర్‌ కూడా ఫిక్సింగ్‌లో  ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ చేయడాన్ని అసిఫ్‌ పరోక్షంగా ప్రస్తావించాడు. (‘నో డౌట్‌.. ఆ సామర్థ్యం కోహ్లిలో ఉంది’)

‘నా కంటే ముందు ఫిక్సింగ్‌ చేసిన వాళ్లు కావొచ్చు.. నాతో పాటు ఫిక్సింగ్‌ చేసిన వారు కావొచ్చు. నా తర్వాత ఫిక్సింగ్స్‌ చేసిన వాళ్లు కావొచ్చు.. ఎవరికైనా రెండో అవకాశం అనేది ఉంటుంది. ప్రతీ ఒక్కరిలాగా నేను కూడా తప్పు చేశా. ఇక్కడ ఫిక్సింగ్‌ చేసిన వేరే వాళ్లకి ఆడే అవకాశం ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా ఉంటుందా పీసీబీ విధానం. ఫిక్సింగ్‌కు పాల్పడిన కొంతమంది క్రికెటర్లను పీసీబీ కాపాడింది. పీసీబీ మనుషులు కాబట్టి వారిని రక్షించుకుంది. నన్ను ఏ విషయంలోనూ పట్టించుకోలేదు.పాకిస్తాన్‌ క్రికెట్‌లో నేనే చివరి ఫిక్సర్‌ను అన్నట్లు ట్రీట్‌ చేస్తున్నారు. 

నా తర్వాత కూడా చాలా మంది ఫిక్సింగ్‌  చేశారు. వారికి కూడా పీసీబీ అవకాశం ఇచ్చింది. కొంతమంది  ఏకంగా పీసీబీలోనే  ఉన్నారు’  అంటూ అసిఫ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడితో తన ప్రపంచం ఏమీ అయిపోలేదని, జరిగిపోయిందేదో జరిగిందని, ఇక జరగాల్సింది మాత్రమే ఉందన్నాడు. తన కెరీర్‌లో చాలా క్రికెట్‌ను ఆడేశానని అసిఫ్‌ పేర్కొన్నాడు. తాను క్రికెట్‌ ఆడే సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నాడు. తానెప్పుడు స్వార్థ పరుడిలా ఉండేవాడినని చాలా మంది అంటారనీ, అది వికెట్లు తీసి జట్టును గెలిపించాలనే స్వార్థం మాత్రమేనన్నాడు. జట్టు విజయం కోసం ఎప్పుడూ శ్రమించేవాడినని, ఒకవేళ అదే స్వార్థమైతే తాను ఏమీ చేయలేనని అసిఫ్‌ పేర్కొన్నాడు.(కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top