నేటి నుంచి దక్షిణాఫ్రికా–ఆస్ట్రేలియా తొలి టెస్టు  | first Test of South Africa-Australia since today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దక్షిణాఫ్రికా–ఆస్ట్రేలియా తొలి టెస్టు 

Mar 1 2018 1:24 AM | Updated on Mar 1 2018 1:24 AM

first Test of South Africa-Australia since today - Sakshi

స్టీవ్‌ స్మిత్‌, డు ప్లెసిస్,

పేస్‌కు పుట్టిల్లయిన డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌ మైదానంలో గురువారం నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది. గాయాల కారణంగా భారత్‌తో సిరీస్‌ చివర్లో జట్టుకు దూరమైన సఫారీ కెప్టెన్‌ డు ప్లెసిస్, ప్రధాన బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చారు.

సొంతగడ్డపై 1970 నుంచి ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ గెలవని రికార్డును చెరిపేయాలని ప్రొటీస్‌ భావిస్తుండగా, మరోవైపు 2016లో తమను తమ దేశంలోనే ఓడించిన దక్షిణాఫ్రికాను ఎలాగైనా మట్టికరిపించాలని స్టీవ్‌ స్మిత్‌ సేన ప్రతీకారేచ్ఛతో ఉంది. ఈ మ్యాచ్‌ సోనీ సిక్స్‌లో మధ్యాహ్నం గం. 1.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement