ఏడ్చింది నిజమే కానీ ధోని ఔటైనప్పుడు కాదు

Fact Check - Photographer Crying Pic while Dhoni Out is a Fake News - Sakshi

హైదరాబాద్‌ : ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఘోర పరాభావం చవిచూసింది. కివీస్‌ మ్యాచ్‌లో కీలక సమయంలో ధోని రనౌట్‌ కావడంతో కోహ్లిసేన ఓటమికి దారితీసింది. అయితే ధోని అనూహ్యంగా రనౌట్‌ కావడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా ధోనికి చివరి వరల్డ్‌కప్‌ అని భావిస్తుండటంతో అందరూ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో సోషల్‌ మీడియాలో పలుఫోటోలు తెగ వైరల్‌ అయ్యాయి. అందులో ముఖ్యంగా మ్యాచ్‌ కవరేజ్‌ చేస్తున్న ఫోటోగ్రాఫర్‌ ధోని ఔట​వ్వడంతో ఏడ్చినట్టు ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయింది. అయితే అది ఫేక్‌ ఫోటో అని నిర్దారణ అయింది. 

ఫోటోగ్రాఫర్‌ ఏడ్చింది నిజమే.. కానీ ధోని ఔటనప్పుడు కాదని తేటతెల్లమైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆసియా ఫుట్‌బాల్‌ కప్‌లో భాగంగా ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరాక్‌ ఓడిపోవడంతో ఆ దేశ ఫోటోగ్రాఫర్‌ కన్నీరుపెట్టుకున్నాడు. అయితే అప్పటి ఫోటోను తీసుకొని కొందరు ధోని ఔటనప్పుడు ఏడ్చినట్టు నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. అది తెగవైరల్‌ అవడంతో పాటు.. హృదయాలను హత్తుకునేలా ఉండటంతో ధోని సపోర్టర్స్‌ తెగ షేర్‌ చేశారు. తీరా అసలు విషయం తెలిశాక నాలుక కరుచుకుంటున్నారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top