వ్యాయామం తప్పనిసరి: నైనా జైస్వాల్ | Exercise is mandatory: Nina Jaiswal | Sakshi
Sakshi News home page

వ్యాయామం తప్పనిసరి: నైనా జైస్వాల్

May 29 2014 12:13 AM | Updated on Mar 28 2019 6:19 PM

ఆరోగ్యవంతమైన జీవనానికి వ్యాయామం తప్పనిసరని టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ తెలిపింది.

అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఆరోగ్యవంతమైన జీవనానికి వ్యాయామం తప్పనిసరని టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ తెలిపింది. శారీరక శ్రమ కరువైన ఇప్పటి బిజీ  లైఫ్‌లో ప్రతి ఒక్కరు రోజు కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలని ఆమె పేర్కొంది. సెయింట్ ఆన్స్ కళాశాల (మెహిదీపట్నం) విద్యార్థులకు అబిడ్స్‌లోని ఇన్‌స్పైర్ ఫిట్‌నెస్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన న్యూట్రిషన్, ఫిట్‌నెస్ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొంది.
 
  ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడిని జయించేందుకు వ్యాయామం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది. దీంతో పాటు వైద్యుల సలహా మేరకు ఆహారపు అలవాట్లు, జీవన శైలిని కూడా మార్చుకోవాలని సూచించింది. అనంతరం విద్యార్థులకు ఆమె సర్టిఫికేట్లను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పైర్ సెంటర్ సీఈఓ డేవిడ్ జూడ్, యోగా శిక్షకులు సంగీత, ఏరోబిక్ ట్రెయినర్ అమీనా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement