ఇంగ్లండ్‌తో టెస్ట్‌: తెలుగోడి అరంగేట్రం

England Won The Toss And Elected to Bat Against India - Sakshi

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

విహారి, జడేజా ఇన్‌.. పాండ్యా, అశ్విన్‌ ఔట్‌

మార్పుల్లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టుతో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్‌ పాండ్యా స్థానంలో విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో రవీంద్ర జడేజాలను తీసుకుంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి యువ ఆటగాడు విహారికి క్యాప్‌ అందజేశాడు. ట్రిపుల్‌ సెంచరీ హీరో కరుణ్‌ నాయర్‌ను పక్కనపెట్టి మరి విహారిని ఎంపిక చేయడం విశేషం.

ఇక భారత్‌ తరపున టెస్ట్‌ ఆడుతున్న 292వ ఆటగాడిగా విహారి గుర్తింపు పొందాడు. నాలుగో టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని అశ్విన్‌ అంత అనుకున్నట్లే తొలిగించి జడేజాకు అవకాశం కల్పించారు. మరో బ్యాట్స్‌మన్‌ అవసరమని భావించిన జట్టు యాజమాన్యం మంచి ఫామ్‌లో ఉన్న విహారికి  అవకాశం కల్పించింది. పృథ్వీ షాకు అవకాశం ఇస్తారని భావించగా టీమ్‌ మరోసారి రాహుల్‌, ధావన్‌లపై నమ్మకం ఉంచింది. ఇంగ్లండ్‌ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్‌లో గాయంతో కీపింగ్‌కు దూరంగా ఉన్న బెయిర్‌ స్టో ఈ మ్యాచ్‌లో కీపింగ్‌ చేయనున్నాడు.

భారత్‌ : కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రాహుల్‌, పుజారా, రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మ, షమీ, బుమ్రా. 
ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), కుక్, జెన్నింగ్స్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, కరన్, రషీద్, బ్రాడ్, అండర్సన్‌.

కాకినాడలో జననం
టీమ్‌ ఇండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్‌ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ  సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు.

చదవండి: టీమిండియాలో ‘విహారం’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top