పెర్త్ వన్డే: ఇంగ్లండ్ 54 పరుగులకే 4 వికెట్లు | england score 44/3 | Sakshi
Sakshi News home page

పెర్త్ వన్డే: ఇంగ్లండ్ 54 పరుగులకే 4 వికెట్లు

Jan 30 2015 2:17 PM | Updated on Sep 2 2017 8:32 PM

పెర్త్ వన్డే: ఇంగ్లండ్ 54 పరుగులకే 4 వికెట్లు

పెర్త్ వన్డే: ఇంగ్లండ్ 54 పరుగులకే 4 వికెట్లు

ఇంగ్లండ్తో మ్యాచ్లో భారత బౌలర్లు రాణిస్తున్నారు.

పెర్త్: ఇంగ్లండ్తో మ్యాచ్లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 ఓవర్లలో 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు బిన్నీ రెండు..  మోహిత్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బెల్ (10), అలీ (17)తో పాటు రూట్ (3), మోర్గాన్ (2) అవుటయ్యారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement