ఆ పొడగరిని చూసేందుకు పోటెత్తిన జనం..

Eight Feet Tall Afghan Cricket Fan Emerges Centre Of Attraction - Sakshi

లక్నో : వెస్టిండీస్‌, ఆప్ఘనిస్తాన్‌ క్రికెటర్లు బస చేసిన హోటళ్ల వైపు కన్నెత్తి చూడని జనం ఇరు జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లను చూసేందుకు వచ్చిన ఆప్ఘన్‌ అభిమానిని మాత్రం చూసేందుకు క్యూ కడుతున్నారు. 8.2 అడుగుల పొడవున్న షేర్‌ ఖాన్‌ను చూసేందుకు ఆయన బస చేసిన హోటల్‌కు జనం పోటెత్తారు. అత్యంత పొడగరి షేర్‌ ఖాన్‌కు ఆయన ఎత్తు కారణంగా పలు హోటళ్లు రూం ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో విసుగుచెందిన షేర్‌ ఖాన్‌ పోలీసుల సాయం కోరగా వారు హోటల్‌ రాజధానిలో రూం ఇప్పించారు. కాబూల్‌కు చెందిన అత్యంత పొడగరి ఖాన్‌ను చూసేందుకు హోటల్‌ వెలుపల వందలాది మంది గుమికూడారు. పొడగరిని చూసేందుకు దాదాపు 200 మందికి పైగా వచ్చారని, దీంతో షేర్‌ ఖాన్‌ డిస్ట్రబ్‌ అయ్యారని హోటల్‌ యజమాని రణు చెప్పారు. హోటల్‌ వెలుపల జనం పెద్దసంఖ్యలో గుమికూడటంతో ఆప్ఘన్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఆయనను పోలీసులు ఎస్కార్ట్‌గా నిలిచి స్టేడియంకు తీసుకువెళ్లారు. మరో నాలుగైదు రోజులు షేర్‌ ఖాన్‌ నగరంలో​ ఉంటారని హోటల్‌ యజమాని తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top