ఇండియా గ్రీన్‌ లక్ష్యం 474 | Duleep Trophy 2017: India Red's Priyank Panchal, Dinesh Karthik | Sakshi
Sakshi News home page

ఇండియా గ్రీన్‌ లక్ష్యం 474

Sep 10 2017 12:54 AM | Updated on Sep 12 2017 2:22 AM

దులీప్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా గ్రీన్‌ ముందు ఇండియా రెడ్‌ జట్టు 474 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

లక్నో: దులీప్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా గ్రీన్‌ ముందు ఇండియా రెడ్‌ జట్టు 474 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు శనివారం ఆటలో ప్రియాంక్‌ పాంచల్‌ (133 నాటౌట్‌), దినేశ్‌ కార్తీక్‌ (100 నాటౌట్‌) అజేయ సెంచరీలు సాధించడంతో రెడ్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 75 ఓవర్లలో రెండు వికెట్లకు 307 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో గ్రీన్‌పై 473 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత భారీ లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన గ్రీన్‌ 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement