హారిక విజయం... హంపి గేమ్ డ్రా | Dronavalli Harika won...humpy game draw | Sakshi
Sakshi News home page

హారిక విజయం... హంపి గేమ్ డ్రా

Sep 6 2014 12:44 AM | Updated on Sep 2 2017 12:55 PM

హారిక విజయం... హంపి గేమ్ డ్రా

హారిక విజయం... హంపి గేమ్ డ్రా

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయం నమోదు చేయగా... కోనేరు హంపి ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది.

షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయం నమోదు చేయగా... కోనేరు హంపి ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. శనివారం జరిగిన పదో రౌండ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 89 ఎత్తుల్లో ఎలీనా డానిలియన్ (ఆర్మేనియా)పై గెలిచింది.
 
  వెన్‌జున్ జూ (చైనా)తో జరిగిన గేమ్‌ను హంపి 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హారిక ఖాతాలో 5.5 పాయింట్లు; హంపి ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. శనివారం జరిగే చివరిదైన 11వ రౌండ్‌లో బాచిమెగ్ (మంగోలియా)తో హారిక; ఎలీనా డానిలియన్‌తో హంపి తలపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement