డీపీఎస్‌ జట్టు ముందంజ | DPS teams enter second round of foot ball championship | Sakshi
Sakshi News home page

డీపీఎస్‌ జట్టు ముందంజ

Sep 23 2017 11:35 AM | Updated on Oct 2 2018 8:39 PM

DPS teams enter second round of foot ball championship - Sakshi

సీబీఎస్‌ఈ క్లస్టర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్, నాచారం) జట్టు ముందంజ వేసింది.

సాక్షి, హైదరాబాద్‌: సీబీఎస్‌ఈ క్లస్టర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్, నాచారం) జట్టు ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన అండర్‌–17 బాలుర తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో డీపీఎస్‌ 3–0తో నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌ జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 9–0తో విద్యానికేతన్‌పై, డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ 4–3తో జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌పై, కెన్నడీ హైస్కూల్‌ 6–0తో వివేకానంద రెసిడెన్షియల్‌ స్కూల్‌పై, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 4–0తో గంగాస్‌ వ్యాలీ స్కూల్‌పై, హెచ్‌పీఎస్‌ రామంతాపూర్‌ 3–0తో డీపీఎస్‌ డైమండ్‌ పాయింట్‌పై, నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌ 5–0తో టైమ్‌ స్కూల్‌పై గెలుపొందాయి. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫల్గుణ, డీపీఎస్‌ చైర్మన్‌ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.  

చిరెక్‌ స్కూల్‌ జట్లకు మిశ్రమ ఫలితాలు

సీబీఎస్‌ఈ క్లస్టర్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ రెండో రోజు చిరెక్‌ స్కూల్‌ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇండస్‌ స్కూల్‌ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన అండర్‌–17 బాలుర విభాగంలో చిరెక్‌ స్కూల్‌ (తెలంగాణ) 19–17తో డీపీఎస్‌ నాచారంపై గెలుపొందింది. అండర్‌–19 విభాగంలో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (తెలంగాణ) 47–24తో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఇండస్‌ స్కూల్‌ (తెలంగాణ) 28–15తో డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (తెలంగాణ)పై, గ్లెండేల్‌ అకాడమీ (తెలంగాణ) 47–24తో భారతీయ విద్యా భవన్స్‌ రెసిడెన్షియల్‌ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీ)పై, సీఆర్‌పీఎఫ్‌ పబ్లిక్‌స్కూల్‌ (తెలంగాణ)21–11తో వికాస్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌పై విజయం సాధించాయి.  

హైజంప్‌లో శామ్సన్‌కు స్వర్ణం

మరోవైపు గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియంలో జరిగిన అండర్‌–19 బాలుర హైజంప్‌ ఈవెంట్‌లో అక్షర విద్యాలయకు చెందిన శామ్సన్‌ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. అతను 1.70మీ ఎత్తుకు జంప్‌ చేయగా, రజతాన్ని గెలుచుకున్న కృతార్థ్‌ రెడ్డి (ఎస్‌వీఐఎస్‌) 1.65మీ. ఎత్తు జంప్‌ చేశాడు. ఈ విభాగంలో భవన్స్‌ స్కూల్‌కు చెందిన హన్సాన్‌ బేగ్‌ (1.40మీ.) కాంస్యాన్ని గెలచుకున్నాడు. అండర్‌– 14 బాలికల లాంగ్‌జంప్‌లో పి. ప్రణీత విజేతగా నిలిచింది. బీవీబీ స్కూల్‌కు చెందిన ప్రణీత 4.15మీ. దూరం జంప్‌చేసి అగ్రస్థానంలో నిలవగా, కేసీపీ సిద్ధార్థ్‌ స్కూల్‌ విద్యార్థిని దేవి గాయత్రి, వి. శ్రీ పూజిత (ఆదిత్య బిర్లా స్కూల్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
800 మీ. పరుగు: 1. శ్రేష్ట (కామర్‌ కాన్వెంట్‌), 2. కషుషా (నవభారత్‌), 3. శ్రేయ (డీపీఎస్‌)
అండర్‌–17 బాలికల జావెలిన్‌ త్రో: 1. జి. ప్రణతి (డిఫెన్స్‌ లేబొరేటరి), 2. తేజ శ్రీ (వీపీఎస్‌), 3. క్రాంతి (సంగమిత్ర).
బాలుర 200మీ. పరుగు: 1. వెంకట్‌ సాయి (వికాస్‌), 2. కె. కిషోర్‌ (హెచ్‌పీఎస్‌ రామంతాపూర్‌), 3. ఎస్‌. లోహిత్‌ (శ్రీ ప్రకాశ్‌).
షాట్‌పుట్‌: 1. మురళి (అక్షర విద్యాలయ), 2. డి. మణికంఠ (ఎస్‌వీసీఎస్‌), 3. మోక్షజ్ఞ (ఏపీఎస్‌).
3000మీ.: 1. డి. సంతోష్‌ (హెచ్‌పీఎస్‌), 2. రహమాన్, 3. మహిపాల్‌ (ఏసీఈఎస్‌).
హైజంప్‌: 1. నికేశ్‌ (అక్షర), 2. రామ్‌చరణ్‌ (ఎంఎన్‌ఆర్‌ స్కూల్‌), 3. శ్రీకిరణ్‌ (సీఆర్‌పీఎఫ్‌).
జావెలిన్‌: 1. ఆకాశ్‌ (అకర్డ్‌ స్కూల్‌), 2. కె. ప్రవీణ్‌ (ఆర్మీ స్కూల్‌).
400మీ.: 1. పృథ్వీ (డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌), 2. విశాల్‌ (వీపీఎస్‌), 3. లక్ష్మణ్‌ తేజ్‌ (ఎంఎన్‌ఆర్‌).
అండర్‌–19 బాలుర జావెలిన్‌ త్రో: 1. జి. శివగణేశ్‌ (హెచ్‌పీఎస్‌), 2. దేవ కుమార్‌ (అక్షర విద్యాలయ), 3. రిషి వర్ధన్‌ (అకర్డ్‌ స్కూల్‌). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement