కోహ్లి 'ఫస్ట్‌ లవ్' ఎవరో తెలుసా! | Do you know who is Virat Kohli first love.. | Sakshi
Sakshi News home page

కోహ్లి 'ఫస్ట్‌ లవ్' ఎవరో తెలుసా!

May 26 2016 8:09 AM | Updated on Sep 4 2017 12:55 AM

కోహ్లి 'ఫస్ట్‌ లవ్' ఎవరో తెలుసా!

కోహ్లి 'ఫస్ట్‌ లవ్' ఎవరో తెలుసా!

మైదానంలో విశ్వరూపం చూపుతూ.. సయమొచ్చినప్పుడల్లా రికార్డులు బ్రేక్ చేస్తున్న విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికులకు కొత్త ఆరాధ్య దైవమయ్యాడు.

న్యూఢిల్లీ: మైదానంలో విశ్వరూపం  చూపుతూ.. సయమొచ్చినప్పుడల్లా రికార్డులు బ్రేక్ చేస్తున్న విరాట్ కోహ్లి ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికులకు కొత్త ఆరాధ్య దైవమయ్యాడు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తున్న ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్‌ మైదానంలో ప్రదర్శనతోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

గాఢమైన ప్రేమలో మునిగిపోయి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నకోహ్లి, బాలీవుడ్ హీరోయిన్‌ అనుష్క బ్రేకప్‌ కథనాలు కంచికి చేరి వీరు మళ్లీ ఒకటయ్యారు. ఈ ప్రేమజంట మళ్లీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. నూనుగు మీసాల యవ్వనప్రాయంలో తాను కరిష్మా కపూర్‌ అంటే పడి చచ్చేవాడినని, ఫస్ట్‌ క్రష్‌, ఫస్ట్ లవ్‌ లాంటి భావన ఆమెతోనే మొదలైందని చెప్పుకొచ్చాడు. విరాట్ కుర్ర వయస్సులో ఉన్నప్పుడు కరిష్మా కపూర్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలింది. అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇప్పుడు కరిష్మా సినిమాల నుంచి తప్పుకుంది. విరాట్‌ క్రికెట్ రంగంలో దూసుకుపోతూ తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో తన యుక్తప్రాయం గురించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కోహ్లి ఈ విషయాలు తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement