దీపా విఫలం

Dipa Karmakar fails to qualify for balanced beam final, to compete in vault final on Saturday - Sakshi

బాకు (అజర్‌బైజా¯Œ ): ప్రపంచకప్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే వాల్ట్‌ విభాగంలో ఫైనల్‌కు అర్హత పొందిన ఆమె బ్యాలెన్సింగ్‌ బీమ్‌ విభాగంలో మాత్రం తడబడింది. త్రిపురకు చెందిన 25 ఏళ్ల దీపా శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 10.633 పాయింట్లు స్కోరు చేసి 25 మందిలో 20వ స్థానాన్ని సంపాదించింది.

ఎమ్మా నెదోవ్‌ (ఆస్ట్రేలియా–13.466 పాయింట్లు) అందరికంటే ఎక్కువ స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాప్‌–8లో నిలిచిన వారికి ఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది. నేడు జరిగే వాల్ట్‌ ఫైనల్లో దీపా పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top