అకీరాపై ధ్రువ గెలుపు | Dhruwa Beats Akeera | Sakshi
Sakshi News home page

అకీరాపై ధ్రువ గెలుపు

Jun 30 2019 1:57 PM | Updated on Jun 30 2019 1:57 PM

Dhruwa Beats Akeera - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అండర్‌–25 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ధ్రువ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు. రాష్ట్ర చెస్‌ సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన మూడోరౌండ్‌ గేమ్‌లో అకీరా సౌమ్యనాథ్‌పై ధ్రువ గెలుపొందాడు. ఇతర బోర్డుల్లో విశ్వతేజపై బిపిన్‌ రాజ్, శ్రీ చరణ్‌పై శిబి శ్రీనివాస్, శ్రేయపై నాగ సాయి, శ్రీకాంత్‌పై పవన్‌ తేజ నెగ్గారు.

మూడో రౌండ్‌ అనంతరం 3 పాయింట్లతో ధ్రువ, బిపిన్‌ రాజ్, నాగ సాయి, శిబి శ్రీనివాస్, పవన్‌ తేజ, నికుంజ్, సాయి అచ్యుత్‌ సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచారు. ఏడు రౌండ్ల పాటు జరుగనున్న ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. జాతీయ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఈ జట్టు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తుంది.   

Advertisement
 
Advertisement
Advertisement