ఎలాంటి డ్రెస్సులు వేయాలో తెలీదా?

Dhoni Wife Sakshi Slammed for Inappropriate Outfit

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ భార్య సాక్షి ధోనీపై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్ల వర్షం కురుస్తోంది. సాక్షి ఈ మధ్యే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ పూర్ణ పటేల్‌ సంగీత్‌ కార్యక్రమానికి ఈ మధ్య హాజరయ్యారు. అందుకోసం మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన డ్రెస్సును ఆమె ధరించారు. అయితే ఆ డ్రెస్సే సోషల్‌ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించేలా చేసింది. 

‘ఎలాంటి డ్రెస్సులు వేయాలో తెలీదా? అది అవసరమా?.. సెలబ్రిటీ భార్య అయినంత మాత్రానా ఇలాంటివి వేస్తావా? నీకలు డ్రెస్సింగ్‌ సెన్సే లేదు’ ఇలాంటి కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అయితే ఈ క్రమంలో సాక్షికి సపోర్ట్‌గా పలువురు నిలుస్తున్నారు. ఆ ఫోటోలో ఎలాంటి తప్పు లేదని.. ట్రోల్‌ చేసే వాళ్ల ఆలోచనలే తప్పుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. అయితే భర్త ధోనీలాగే కూల్‌ అని పేరున్న సాక్షి.. ఆయా కామెంట్లకు రియాక్ట్‌ కాకుండా ఉండిపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top