ధర్మశాలలో భారత్-పాక్ మ్యాచ్ | Dharamsala to host World T20 India-Pakistan match | Sakshi
Sakshi News home page

ధర్మశాలలో భారత్-పాక్ మ్యాచ్

Dec 11 2015 1:57 PM | Updated on Sep 3 2017 1:50 PM

ధర్మశాలలో భారత్-పాక్ మ్యాచ్

ధర్మశాలలో భారత్-పాక్ మ్యాచ్

భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఐసీసీ తీపికబురు అందించింది.

ముంబై: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఐసీసీ తీపికబురు అందించింది. దాయాది జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుందని ప్రకటించింది. టి20 ప్రపంచకప్ లో భాగంగా మార్చి 19న రెండు జట్ల మధ్య ముఖాముఖి పోరు జరగనుంది.

టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉన్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement