Sakshi News home page

IND Vs ENG 5th Test: ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు

Published Wed, Mar 6 2024 6:11 PM

IND VS ENG 5th Test: James Anderson Enjoying A Refreshing Dip In A Local Khad In Dharamshala - Sakshi

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ ధర్మశాల వేదికగా రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు లభించిన విరామ సమయాన్ని ఇంగ్లండ్‌ క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ విరామ సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇంగ్లండ్‌ వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ సహచర క్రికెటర్లతో కలిసి స్థానిక జలపాతంలో రీఫ్రెష్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇంగ్లీష్‌ ఆటగాళ్లు సిరీస్‌ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిలో మమేకమైపోయారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా కనెక్టైనట్లుంది. హిమాచల్‌ ప్రదేశ్‌  శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్‌ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి జలపాతాలు, ఎత్తైన మంచు కొండలు భూతలస్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఈ ప్రాంతం ఇంగ్లీష్‌ క్రికెటర్లకు స్వదేశానుభూతిని కలిగిస్తుంటుంది. 

ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు పేలవ ప్రదర్శనతో సొంత అభిమానులను నిరుత్సాహపరిచింది. బజ్‌బాల్‌ అంటూ ఊదరగొట్టిన వీరు రోహిత్‌ సేన దెబ్బకు తోకముడిచారు. బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, రూట్‌ సెంచరీలు మినహా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెప్పకోదగ్గ ప్రదర్శనలు లేవు. స్టార్లతో నిండిన జట్టు నుంచి ఊహించని ప్రదర్శనతో భారత క్రికెట్‌ అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు.


 

 
 

Advertisement

What’s your opinion

Advertisement