ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి వందకు దిగువకు పడిపోయింది.
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి వందకు దిగువకు పడిపోయింది. తాజాగా విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్ ఏకంగా 10 స్థానాల్ని కోల్పోయి 107వ ర్యాంకుకు దిగజారింది.
మే తర్వాత టాప్–100 ర్యాంకు నుంచి పడిపోవడం ఇదే తొలి సారి. జూలైలో 96వ స్థానానికి ఎగబాకడం ద్వారా భారత్ తమ అత్యుత్తమ ర్యాంకు సాధించింది.