దెబోరాకు మూడో పతకం | Deborah Herold wins third medal in Asian Indoor Game | Sakshi
Sakshi News home page

దెబోరాకు మూడో పతకం

Sep 23 2017 1:20 AM | Updated on Sep 23 2017 1:55 AM

Deborah Herold wins third medal in Asian Indoor Game

అష్గబాత్‌ (తుర్క్‌మెనిస్తాన్‌): ఆసియా ఇండోర్, మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడల్లో శుక్రవారం భారత్‌కు రెండు పతకాలు లభించాయి. మహిళల ట్రాక్‌ సైక్లింగ్‌ ఆరు ల్యాప్‌ల కిరిన్‌ ఈవెంట్‌లో దెబోరా హెరాల్డ్‌ రజత పతకాన్ని సాధించింది. ఈ క్రీడల్లో దెబోరాకిది మూడో పతకం. ఇంతకుముందు ఆమె మహిళల 200 మీటర్ల వ్యక్తిగత, టీమ్‌ స్ప్రింట్‌ విభాగాల్లో రజత పతకాలు గెలిచింది. మహిళల అండర్‌ – 48 కురాష్‌ ఈవెంట్‌లో మాలప్రభ యెల్లప్ప జాదవ్‌ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌ ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement