డివిలియర్స్‌ వీర విహారం.. భారీ శతకం

de Villiers missed double century against Bangladesh

పార్ల్‌ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి భారీ శతకం (104 బంతుల్లో 176, 15 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించాడు. డివియర్స్‌, హషీం ఆమ్లా(85) రాణించడంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లాడి 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసి బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు ఆమ్లా(92 బంతుల్లో 4 ఫోర్లు), క్వింటన్‌ డికాక్‌ (46) లు తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో షకీబ్‌ అల్‌ హసన్‌ సఫారీలకు డబుల్‌ షాకిచ్చాడు. ఓ ఓవర్లో 3వ బంతికి డికాక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న షకీబ్‌.. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్‌ డుప్లెసిస్‌ను బౌల్డ్‌ చేశాడు. ఆమ్లా, డివిలియర్స్‌ లు చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ చేసిన ఆమ్లా(85) ఇన్నింగ్స్‌ 36వ ఓవర్లో రుబెల్‌ హుస్సేన్‌ బౌలింగ్ల్లో ఔట్‌ కావడంతో సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది.​

భారీ షాట్లతో చెలరేగి ఆడిన డివిలయర్స్‌ 68 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. డుమిని(30 బంతుల్లో 30) నుంచి అతడికి సహకారం లభించింది. 36వ ఓవర్లో బంగ్లా బౌలర్‌ రుబెల్‌ హుస్పేన్‌ను డివిలియర్స్‌ ఓ ఆటాడుకున్నాడు. ఓ రెండు సిక్సర్‌లు, ఓ ఫోర్‌ సాయంతో 18 పరుగులు పిండుకున్నాడు. ఐతే జట్టు స్కోరు పెంచే క్రమంలో డబుల్‌ సెంచరీ దిశగా వెళ్తున్న డివిలియర్స్‌ (176)ను నాల్గో వికెట్‌గా రుబెల్‌ ఔట్‌ చేయడంతో బంగ్లా ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో రుబెల్‌.. నాలుగో బంతికి డుమినిని, ఐదో బంతికి ప్రిటోరియస్‌ను పెవిలియన్‌ చేర్చాడు. చివర్లో సఫారీ ఆటగాళ్లు తడబడటంతో సఫారీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top