డీకాక్‌ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ!

De Kock Won't Be Test Captain, Graeme Smith - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు(సీఎస్‌ఏ) డైరెక్టర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన రోజే గ్రేమ్‌ స్మిత్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా తాత్కాలిక టెస్టు కెప్టెన్‌గా ఉన్న క్వింటాన్‌ డీకాక్‌ను తప్పించాడు.   గత డిసెంబరులో సీఎస్‌ఏ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితుడైన స్మిత్‌.. తాజాగా పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 2022, మార్చి 20 వరకూ స్మిత్‌ ఈ పదవిలో కొనసాగుతాడు.. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్మిత్‌ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌గా డీకాక్‌ను తొలగిస్తున్నట్లు తెలిపాడు. డుప్లెసిస్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక కెప్టెన్‌గా డీకాక్‌ను నియమించారు. ఇప్పుడు డీకాక్‌ను తప్పిస్తూ స్మిత్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కాగా, ఇంకా ఎవరిని నియమిస్తారన్న చర్చ మాత్రం తనకు సవాలుగా నిలిచిందన్నాడు. (గ్రేమ్‌ స్మిత్‌.. మరో రెండేళ్లు!)

‘వన్డే జట్టు కెప్టెన్‌గా, కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా డీకాక్‌పై పెద్ద బాధ్యతలున్నాయి. అందువల్ల డికాక్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం లేదు. డీకాక్‌ నుంచి ఇంకా స్థిరమైన ప్రదర్శన కోరుకుంటున్నాము. టెస్టులకు కూడా కెప్టెన్‌ ఉంటే అతనిపై ఒత్తిడి పెరుగుతుంది. అది జట్టుకు ప్రయోజనకరం కాదు’ అని స్మిత్‌ తెలిపాడు. కాగా, మరి టెస్టు కెప్టెన్‌ ఎవరు అనే దానిపై స్మిత్‌ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉందని స్మిత్‌ తెలిపాడు. తాను ఇచ్చే  కచ్చితమైన సమాధానం ఏదైనా ఉందంటే అది డీకాక్‌ను తప్పించడమే కానీ, ఆ స్థానం ఎవరిది అనే దానిపై ఇప్పుడే చెప్పలేనన్నాడు. కేవలం పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మాత్రమే డీకాక్‌ ఉంటాడని, టెస్టు ఫార్మాట్‌కు కాదన్నాడు. త్వరలో వెస్టిండీస్‌ సిరీస్‌ ఉన్న తరుణంలో అది జరుగుతుందా.. లేదా అనే విషయం కూడా ఇప్పుడే చెప్పలేనన్నాడు. కరోనా వైరస్‌ కారణంగా విండీస్‌తో సిరీస్‌పై పూర్తిస్థాయి స్పష్టత లేదన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top