సిడ్నీ టెస్టు: నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్ | Day 4: India test match started on fourth day | Sakshi
Sakshi News home page

సిడ్నీ టెస్టు: నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్

Jan 9 2015 5:16 AM | Updated on Sep 2 2017 7:24 PM

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ ఆట ఆరంభించింది.

సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు  ఆట ఆరంభించింది.  భారత్ 118.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 350 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం విరాట్ (145)  సాహా(17) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా  ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు.

దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు.  ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ.  ఆసీస్ బౌలర్లలో లయోన్ ఒక వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement