న్యూస్ పేపర్లు చదవడం ఆపితేనే..: వార్నర్

David Warner Urges Matt Renshaw to Avoid Reading Newspapers - Sakshi

మెల్ బోర్న్:త్వరలో యాషెస్ సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో  సహచర ఓపెనర్ రెన్ షాకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హితబోధ చేశాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ కాస్ల్ క్రికెట్ లో భాగంగా ఫెఫల్డ్ షీల్డ్ పోరులో క్వీన్ లాండ్స్ తరపున బరిలోకి దిగిన రెన్ షా విఫలమైన నేపథ్యంలో వార్నర్ కొన్ని సూచనలు కూడిన హెచ్చరికలు చేశాడు. 'నువ్వు స్కోరు బోర్డుపై పరుగులు చూడాలనుకుంటే న్యూస్ పేపర్లు చదవడం ఆపేయ్. ఈ వారంలో నువ్వు పరుగులు చేస్తావని ఆశిస్తున్నా. నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనబడుతున్నావ్. ఒత్తిడిని అధిగమించాలంటే న్యూస్ పేపర్లకు దూరంగా ఉండు. బోర్డుపై పరుగులు చేయడానికి యత్నించు. యాషెస్ లో నీకు మరో ఎండ్ లో ఉన్న నన్ను నిరాశపరచకుండా ఆడతావని ఆశిస్తున్నా. సహచర ఆటగాడిగా నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ వారపు షెఫల్డ్ షీల్డ్ మ్యాచ్ ల్లో సత్తా చాటడానికి యత్నించు' అని వార్నర్ సూచించాడు.

ఈ ఏడాది దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లతో స్వదేశంలో  జరిగిన సిరీస్ లలో ఓపెనర్ గా ఆకట్టుకున్న రెన్ షా.. భారత పర్యటనలో భాగంగా మార్చిలో బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో 60 పరుగులు మెరిశాడు. కాగా, గత తొమ్మిది టెస్టు ఇన్నింగ్స్ ల్లో రెన్ షా ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ప్రస్తుతం జరుగుతున్న షెఫల్డ్ షీల్డ్ టోర్నమెంట్ లో కూడా రెన్ షా విఫలమయ్యాడు. ఇప్పటివరకూ నాలుగు ఇన్నింగ్స్ లు ఆడిన రెన్ షా 20 పరుగుల్ని దాటడంలో విఫలయ్యాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top