తెలుగు టైటాన్స్‌ పరాజయం | Dabang Delhi Beat Telugu Titans | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌ పరాజయం

Sep 17 2019 2:31 AM | Updated on Sep 17 2019 2:31 AM

Dabang Delhi Beat Telugu Titans - Sakshi

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 29–37తో దబంగ్‌ ఢిల్లీ చేతిలో ఓడింది. సిద్దార్థ్‌ దేశాయ్‌ 12 పాయింట్లతో రాణించినా అతనికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. ఢిల్లీ రైడర్‌ నవీన్‌ కుమార్‌ మాత్రం మరో సూపర్‌ ‘టెన్‌’ (12 పాయింట్లు) సాధించాడు. సీజన్‌లో టైటాన్స్‌కు మరో ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 38–22తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది.   

Advertisement
 
Advertisement
Advertisement