స్వదేశం చేరుకున్న మొదటి క్రికెటర్‌ | Cricketer Rohit Sharma has Returned to India with his Family | Sakshi
Sakshi News home page

స్వదేశం చేరుకున్న మొదటి క్రికెటర్‌

Jul 13 2019 4:25 PM | Updated on Jul 13 2019 4:31 PM

Cricketer Rohit Sharma has Returned to India with his Family - Sakshi

సాక్షి, ముంబై: ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో అందరి కంటే ముందు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇండియాకు వచ్చేశాడు. శనివారం తెల్లవారు జామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రోహిత్‌ కారులో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య రితిక, కూతురు సమైరా ఉన్నారు.

ఈ  ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి నిరాశపరిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement