మొర్తజా గెలిచాడు

Cricket star Mashrafe Mortaza claims landslide victory in Bangladesh  - Sakshi

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో  ఎంపీగా ఘన విజయం  

ఢాకా: తాజాగా జరిగిన బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మష్రఫె మొర్తజా ఎంపీగా గెలిచాడు. నరైల్‌–2 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్‌ తరఫున పోటీ చేసిన 35 ఏళ్ల మొర్తజా 2,74,418 ఓట్లు సాధించాడు. అతడి ప్రత్యర్థి, జాతీయ ఐక్య కూటమి అభ్యర్థి ఫరీదుజ్మాన్‌ ఫర్హాద్‌కు కేవలం 8,006 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3,17,844 కాగా పోలైన వాటిలో 96 శాతం మొర్తజాకే పడటం విశేషం. ‘నరైల్‌ ఎక్స్‌ప్రెస్‌’గా పేరుగాంచిన అతడు... నయీముర్‌ రెహ్మాన్‌ తర్వాత ఎంపీ అయిన రెండో బంగ్లాదేశీ కెప్టెన్‌గా, క్రికెట్లో ఉంటూనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా  రికార్డులకెక్కాడు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top