
క్రికెట్‌కు కీస్‌వెట్టర్ గుడ్‌బై
కంటి గాయం కారణంగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ క్రెయిగ్ కీస్‌వెట్టర్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
లండన్ : కంటి గాయం కారణంగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ క్రెయిగ్ కీస్‌వెట్టర్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది జూలైలో నార్తంప్టన్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సోమర్‌సెట్ తరఫున బ్యాటింగ్ చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన బంతి కీస్‌వెట్టర్ ఎడమ కంటితో పాటు ముక్కును బలంగా తాకింది. దీంతో చూపు మందగించడంతో ఆట నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఇంగ్లండ్ తరఫున కీస్‌వెట్టర్ 46 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌లు ఆడాడు.