డివిలియర్స్ మళ్లీ దుమ్మురేపాడు | CPL: AB de Villiers Roars Back to Form, Helps Barbados Tridents to Emphatic Win | Sakshi
Sakshi News home page

డివిలియర్స్ మళ్లీ దుమ్మురేపాడు

Jul 6 2016 3:49 PM | Updated on Aug 13 2018 8:10 PM

డివిలియర్స్ మళ్లీ దుమ్మురేపాడు - Sakshi

డివిలియర్స్ మళ్లీ దుమ్మురేపాడు

ఏబీ డివిలియర్స్ మరోసారి దుమ్ము రేపాడు. సీపీఎల్ లో విజృంభించి ఆడి అజేయ అర్ధశతకంతో తన జట్టు బార్బడోస్ ట్రైడెంట్స్ కు విజయాన్ని అందించాడు.

సెయింట్ కిట్స్: ఏబీ డివిలియర్స్ మరోసారి దుమ్ము రేపాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో విజృంభించి ఆడి అజేయ అర్ధశతకంతో తన జట్టు బార్బడోస్ ట్రైడెంట్స్ కు విజయాన్ని అందించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో బార్బడోస్ టీమ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగులుండగానే ఆధిగమించింది. 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.

డివిలియర్స్ తనదైన శైలిలో చెలరేగి 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు. షోయబ్ మాలిక్(54) అర్ధ సెంచరీతో రాణించాడు. పొలార్డ్ 25, పార్నెల్ 16 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన నెవిస్ పాట్రియట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. లెవిస్ 50, కార్టర్ 41, థామస్ 21, స్మట్స్ 14, బ్రాత్ వైట్ 11 పరుగులు సాధించారు. డివిలియర్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement