4 నుంచి చెస్‌ టోర్నమెంట్‌ | Chess Tourney Starts From 4th November | Sakshi
Sakshi News home page

4 నుంచి చెస్‌ టోర్నమెంట్‌

Nov 1 2018 10:02 AM | Updated on Nov 1 2018 10:02 AM

Chess Tourney Starts From 4th November - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మేను’ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ ఈనెల 4 నుంచి జరుగనుంది. బండమైసమ్మ నగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో జరుగనున్న ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 16 లక్షలుగా నిర్వాహకులు ప్రకటించారు. నవంబర్‌ 4 నుంచి 8 వరకు ఓపెన్‌ విభాగంలో, 10 నుంచి 12 వరకు ఫిడే రేటింగ్‌ బిలో 1350 స్థాయి క్రీడాకారులకు ఈ పోటీలు జరుగుతాయి.

ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌ బాబు అతిథిగా విచ్చేసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీఏ కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్, కార్యదర్శి షేక్‌ ఫయాజ్‌ పాల్గొన్నారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం 88858 17666 నంబర్‌లో సంప్రదించవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement