విమానంలో కింగ్స్‌ సందడి

Chennai Super Kings celebrate title win with airplane crew - Sakshi

సాక్షి, చెన్నై : ఐపీఎల్‌ –2018 సుల్తాన్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవతరించిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్‌ , బ్యాటింగ్‌తో ధోని సేన అభిమానుల మన్ననల్ని అందుకుంది. చెన్నైకి చేరుకున్న కింగ్స్‌ సేనకు బ్రహ్మరథం పట్టే రీతిలో అభిమాన లోకం ఆహ్వానం పలికింది. చెన్నైలోని ఓ హోటళ్లో ప్రముఖులు, కింగ్స్‌ ప్రతినిధులతో సంబరాలు చేసుకున్నారు. అయితే, ముంబై నుంచి చెన్నైకు వచ్చే సమయంలో విమానంలో కింగ్స్‌ సేన సంబరాల్లో మునిగాయి. ముంబైలో మ్యాచ్‌ ముగించుకుని సోమవారం జట్టు సభ్యులు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు.

వాట్సన్‌తో పైలట్‌ , ఐపీఎల్‌ కప్‌తో ఆనందం
వీరంతా జెట్‌ ఎయిర్‌ వేస్‌లో పయనించారు. క్రికెటర్లు తమ విమానంలో పయనిస్తుండడంతో ముందుగానే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సిబ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. సొంత గడ్డ చెన్నైలో అడుగు పెట్టనున్న ధోని సేనతో కలిసి విమానంలో విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. కేక్‌ కట్‌ చేశారు. కప్‌ను విమాన పైలట్, ఎయిర్‌ హోస్టస్‌లు చేత బట్టి ఆనందంలో ఉబ్బితబ్బిబ్బ య్యారు. క్రికెటర్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాల్ని హోరెత్తించారు.

కేక్‌ తినిపిస్తున్న బ్రేవో ,కేక్‌ కట్‌ చేస్తున్న వాట్సన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top