కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో స్మృతి మంధాన  | Career Best Rank Memorandum | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో స్మృతి మంధాన 

Apr 17 2018 12:55 AM | Updated on May 29 2019 2:49 PM

Career Best Rank Memorandum - Sakshi

ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్‌ స్మృతి మంధాన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసిన బ్యాట్స్‌ఉమెన్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి 10 స్థానాల పురోగతి సాధించి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. ఈ ఏడాది స్మృతి తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడి ఐదు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 531 పరుగులు చేసింది. భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఏడో స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ మూడో స్థానానికి ఎగబాకింది. 

Advertisement
 
Advertisement
Advertisement