IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే? | IND W vs ZIM W 1st T20I: India Bowlers Shines Zimbabwe Score 114 | Sakshi
Sakshi News home page

IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?

Oct 16 2026 8:38 PM | Updated on Oct 16 2026 8:52 PM

IND W vs ZIM W 1st T20I: India Bowlers Shines Zimbabwe Score 114

భారత మహిళల క్రికెట్‌ జట్టు (PC: BCCI Women X)

జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టుతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆది నుంచే నిప్పులు చెరిగి పర్యాటక జట్టును నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశారు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు జింబాబ్వే మహిళా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య రాయ్‌పూర్‌ వేదికగా టీ20 సిరీస్‌ మొదలైంది.

ఓపెనర్‌ డకౌట్‌
టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగింది. ఆదిలోనే క్రాంతి గౌడ్‌.. జింబాబ్వే ఓపెనర్‌ బిలవ్‌డ్‌ బిజాను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్‌గా వెనక్కి పంపింది.

ఇక మరో ఓపెనర్‌ కెలిస్‌ ఎంధ్లోవు (44 బంతుల్లో 42) పోరాడే ప్రయత్నం చేయగా.. అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యింది. మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాడెస్టర్‌ ముపాచిక్వా 16 పరుగులు చేయగా.. షేర్న్‌ మేయర్స్‌ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. 

114 పరుగులు
ఇక నయాశా గ్వన్‌జురా (9), మిచెల్లి మవుంగ (0) పూర్తిగా విఫలం కాగా.. చిపో ముగెరి టిరిపానో (1*) అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నందాని శర్మ రెండు వికెట్లు తీయగా.. తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి చెరో వికెట్‌ తీయగా.. క్రాంతి గౌడ్‌ ఒక వికెట్‌ దక్కించుకుంది.

చదవండి: IND vs WI: విండీస్‌తో ఐదో టీ20.. భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement