న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ | Broom, Williamson script New Zealand's clean sweep | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌

Jan 1 2017 2:09 AM | Updated on Sep 5 2017 12:03 AM

న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌

న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. ఫామ్‌లో ఉన్న నీల్‌ బ్రూమ్‌ (97 బంతుల్లో 97; 12 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌

చివరి వన్డేలోనూ బంగ్లాదేశ్‌ ఓటమి  

నెల్సన్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. ఫామ్‌లో ఉన్న నీల్‌ బ్రూమ్‌ (97 బంతుల్లో 97; 12 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (116 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అదరగొట్టడంతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో కివీస్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో 3–0తో సిరీస్‌ను దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (88 బంతుల్లో 59; 5 ఫోర్లు), ఇమ్రుల్‌ కయేస్‌ (62 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో పాటు నురుల్‌ హసన్‌ (39 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు. హెన్రీ, సాన్‌ట్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 41.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి గెలిచింది. రెండో ఓవర్‌లోనే లాథమ్‌ (4) అవుట్‌ కాగా... మరుసటి ఓవర్‌లో గప్టిల్‌ (6) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే  విలియమ్సన్, బ్రూమ్‌ బంగ్లా బౌలర్ల భరతం పట్టారు. ఎనిమిది మంది బౌలర్లు రంగంలోకి దిగినా 32 ఓవర్ల పాటు వీరి సూపర్‌ షో సాగడంతో మూడో వికెట్‌కు 179 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే రెండో వన్డేలో శతకం బాదిన బ్రూమ్‌ ఈ మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాలో సెంచరీని కోల్పోయాడు. ముస్తఫిజుర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ నెల 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ ప్రారంభం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement