breaking news
Neil Broom
-
న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్
చివరి వన్డేలోనూ బంగ్లాదేశ్ ఓటమి నెల్సన్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఫామ్‌లో ఉన్న నీల్ బ్రూమ్ (97 బంతుల్లో 97; 12 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (116 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టడంతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో కివీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో 3–0తో సిరీస్‌ను దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (88 బంతుల్లో 59; 5 ఫోర్లు), ఇమ్రుల్ కయేస్ (62 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు నురుల్ హసన్ (39 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. హెన్రీ, సాన్‌ట్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 41.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి గెలిచింది. రెండో ఓవర్లోనే లాథమ్ (4) అవుట్ కాగా... మరుసటి ఓవర్లో గప్టిల్ (6) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే విలియమ్సన్, బ్రూమ్ బంగ్లా బౌలర్ల భరతం పట్టారు. ఎనిమిది మంది బౌలర్లు రంగంలోకి దిగినా 32 ఓవర్ల పాటు వీరి సూపర్ షో సాగడంతో మూడో వికెట్‌కు 179 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే రెండో వన్డేలో శతకం బాదిన బ్రూమ్ ఈ మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాలో సెంచరీని కోల్పోయాడు. ముస్తఫిజుర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ నెల 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. -
వన్డే సిరీస్ కివీస్ సొంతం
నీల్ బ్రూమ్ సెంచరీ రెండో వన్డేలోనూ బంగ్లాదేశ్ ఓటమి నెల్సన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే న్యూజిలాండ్ జట్టు 2–0తో గెలుచుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో నీల్ బ్రూమ్ (109 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించడంతో కివీస్ 67 పరుగుల తేడాతో నెగ్గింది. 107 పరుగులకే ఐదు వికెట్లు పడిన దశలో బ్రూమ్, రోంచి (35; 4 ఫొర్లు, 1 సిక్స్) జోడి ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 42.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కయేస్ (59; 6 ఫోర్లు), షబ్బీర్ రహమాన్ (38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఓ దశలో 105/1తో పటిష్టంగా కనిపిం చిన పర్యాటక జట్టు 79 పరుగుల వ్యవధిలో తమ చివరి తొమ్మిది వికెట్లను కోల్పోయింది. విలియమ్సన్కు మూడు, బౌల్ట్, సౌతీలకు రెండేసి వికెట్లు పడ్డాయి.