బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే న్యూజిలాండ్ జట్టు 2–0తో గెలుచుకుంది.
నీల్ బ్రూమ్ సెంచరీ
రెండో వన్డేలోనూ బంగ్లాదేశ్ ఓటమి
నెల్సన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే న్యూజిలాండ్ జట్టు 2–0తో గెలుచుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో నీల్ బ్రూమ్ (109 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడంతో కివీస్ 67 పరుగుల తేడాతో నెగ్గింది. 107 పరుగులకే ఐదు వికెట్లు పడిన దశలో బ్రూమ్, రోంచి (35; 4 ఫొర్లు, 1 సిక్స్) జోడి ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించింది.
అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 42.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కయేస్ (59; 6 ఫోర్లు), షబ్బీర్ రహమాన్ (38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఓ దశలో 105/1తో పటిష్టంగా కనిపిం చిన పర్యాటక జట్టు 79 పరుగుల వ్యవధిలో తమ చివరి తొమ్మిది వికెట్లను కోల్పోయింది. విలియమ్సన్‌కు మూడు, బౌల్ట్, సౌతీలకు రెండేసి వికెట్లు పడ్డాయి.