మేరీ.. పంచ్‌లతోనే కాదు.. పాటతో అదరగొట్టింది!

Boxing Star Mary Kom Knocks Out the Audience With Her Singing Skills - Sakshi

పనాజి : ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌. ఒక ఒలింపిక్‌ మెడల్‌.. ఇది భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ గురించి మనందరికి తెలిసిన విషయం. కానీ ఆమె ఓ మంచి పాప్‌ సింగరని, అద్బుత గొంతులో పాటలు పాడుతుందని ఎవరికి తెలియదు. ఆమెలోని ఈ కొత్త టాలెంట్‌ గోవా ఫెస్ట్‌ 2019 ద్వారా ప్రపంచానికి తెలిసింది. ప్రచారసంస్థలు, మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ ఫెస్ట్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడల నుంచి మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేరికోమ్‌.. వాట్సాప్‌.. అమెరికన్‌ క్లాసిక్‌ సాంగ్‌ను ఆలపించి ఔరా అనిపించారు. ఆమె గానంతో అందరిని మైమరిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మేరీ గాత్రానికి ముగ్దులైన నెటిజన్లు... మేరీ పంచ్‌లతోనే కాదు.. పాటతోను అదరగొట్టారు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top