భారత బాక్సర్ తెలివైన పంచ్లు.. | Boxer Vikas Krishan advances to pre-quarters | Sakshi
Sakshi News home page

భారత బాక్సర్ తెలివైన పంచ్లు..

Aug 10 2016 3:13 PM | Updated on Sep 4 2017 8:43 AM

భారత బాక్సర్ తెలివైన పంచ్లు..

భారత బాక్సర్ తెలివైన పంచ్లు..

రియో ఒలింపిక్స్‌ లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ శుభారంభానిచ్చాడు.

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌ లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ శుభారంభానిచ్చాడు. బాక్సింగ్‌ 75 కిలోల విభాగంలో వికాస్‌ కృష్ణన్‌ తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌ చేరుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పోరులో అమెరికాకు చెందిన చార్లెస్ కాన్‌వెల్‌ పై 3-0 తేడాతో వికాస్ గెలుపొందాడు‌. తొలి మూడు నిమిషాల్లో ప్రత్యర్ధి పంచ్ లను తప్పించుకుని వరుసగా పాయింట్లు సాధించాడు.

వరుసగా మూడు రౌండ్లలో అమెరికన్ బాక్సర్ చార్లెస్ ను తెలివిగా మైండ్ గేమ్ ఆడి దెబ్బకొట్టాడు. అందుకే మూడు రౌండ్లలోనూ కేవలం ఒక్క పాయింట్‌ (29-28, 29-28, 29-28) తేడాతో వికాస్ కృష్ణన్ విజయాన్ని నమోదుచేశాడు. ప్రీక్వార్టర్స్‌లో టర్కీకీ చెందిన సిపల్‌ వండెర్‌తో వికాస్‌ తలపడనున్నాడు. గతంలో ఆసియా గేమ్స్ లో స్వర్ణం సాధించిన వికాస్ పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement