క్వార్టర్స్‌లో బోపన్న జంట ఓటమి | Bopanna pair lost in quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో బోపన్న జంట ఓటమి

Oct 6 2017 12:23 AM | Updated on Oct 6 2017 4:51 AM

Bopanna pair lost in quarterfinals

చైనా ఓపెన్‌ ఏటీపీ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జంట పోరాటం ముగిసింది. బీజింగ్‌లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–క్యువాస్‌ ద్వయం 5–7, 6–7 (6/8)తో టాప్‌ సీడ్‌ హెన్రీ కొంటినెన్‌ (ఫిన్లాండ్‌)–జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జోడీకి 24,755 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 12 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement