ఎంవీ శ్రీధర్‌పై పుస్తకం

Book of The Renaissance Man MV Sridhar Launched - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ మాజీ జనరల్‌ మేనేజర్, హైదరాబాద్‌ మాజీ క్రికెట్‌ ప్లేయర్‌ దివంగత డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన పుస్తకం ‘ది రినాస్సాన్స్‌ మ్యాన్‌– డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌’ పుస్తకావిష్కరణ ఆదివారం జరగనుంది. ఉప్పల్‌ స్టేడియంలోని క్లబ్‌ హౌస్‌లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆవిష్కరిస్తాడు. ఈ పుస్తకాన్ని పి. హరిమోహన్‌ రచించారు. శ్రీధర్‌ జీవిత విశేషాలతో పాటు, అతని నాయకత్వ లక్షణాలు, క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించిన పలు అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఇందులో ముందుమాటను భారత దిగ్గజ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ రాయగా... అజహరుద్దీన్, అనిల్‌ కుంబ్లే, వెంకటపతి రాజు, యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్, అనురాగ్‌ ఠాకూర్‌ తమ అభిప్రాయాలను జోడించారు. ఈ పుస్తకాన్ని రచించిన హరిమోహన్‌ ఆల్‌సెయింట్స్‌ హైస్కూల్‌ తరఫున శ్రీధర్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడే సమయంలో ఆయన జూనియర్‌ కావడం విశేషం.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top