'వరల్డ్ చాంపియన్‌షిప్‌' లో పాల్గొనాలని ఉంది! | Bolt plans to retire after 2017 Worlds | Sakshi
Sakshi News home page

'వరల్డ్ చాంపియన్‌షిప్‌' లో పాల్గొనాలని ఉంది!

Oct 8 2015 6:51 PM | Updated on Sep 3 2017 10:39 AM

'వరల్డ్ చాంపియన్‌షిప్‌' లో పాల్గొనాలని ఉంది!

'వరల్డ్ చాంపియన్‌షిప్‌' లో పాల్గొనాలని ఉంది!

వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని ఇటీవల పేర్కొన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తన ఆలోచనను మరికొంత కాలం పొడిగించే యోచనలో ఉన్నాడు.

న్యూయార్క్: వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని ఇటీవల పేర్కొన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తన ఆలోచనను మరికొంత కాలం పొడిగించే యోచనలో ఉన్నాడు. ఈ మేరకు  2017 లండన్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు.

 

'ఒలింపిక్స్ పరంగా చూస్తే రియో నాకు చివరది. అయితే మరొక వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ లో పాల్గొవాలని ఉంది. అందుకు 2017 వరల్డ్ చాంపియన్ షిప్ సరైన వేదికగా భావిస్తున్నా. రిటైర్మెంట్ తర్వాత కొంతమంది నన్ను యాక్టింగ్ చేయమని అడుగుతున్నారు.  నేను అథ్లెటిక్ గా వచ్చిన గుర్తింపుతోనే ఉండాలని అనుకుంటున్నా.  అథ్లెటిక్స్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత ఏం చేస్తానో?అనే విషయం కచ్చితంగా చెప్పలేను' అని ఆరుసార్లు ఒలింపిక్ విజేత అయిన బోల్ట్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement